- ఆర్డిటికి ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ చేయాలని హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశాం.
- అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెల్లడి.
- జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి అమిత్ షాతో సమావేశం.
- ఆర్డిటి పై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డాయన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.
అనంతపురం జిల్లాలో గత ఐదున్నర దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్డిటీ సంస్థకు ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. జిల్లాకు చెందిన ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్, రాయదుర్గం కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎమ్మెస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, ధర్మవరం టిడిపి ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, టిడిపి ఎంపీలతో కలిసి ఆయన ఆదివారం రోజు ఢిల్లీకి వెళ్లారు. సోమవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ వ్యవహారాల ఇన్చార్జ్ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలసి హోం మంత్రి అమిత్ షాను కలిశారు. జిల్లాలో ఆర్డిటీ అందిస్తున్న సేవా కార్యక్రమాల్లో గురించి ఎమ్మెల్యేలు, ఎంపీలు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఆర్డిటి కోసం ఏపీలో ఉన్న ఎంపీలు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అన్ని అంశాలు వివరించామన్నారు. ఆర్డిటి లాంటి సంస్థ లేకుండా జిల్లాని ఊహించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ విరాళాల ఆధారంగానే ఆర్డిటి సంస్థ నడుస్తోందని.. ఇలాంటి సమయంలో నిధులు ఆగిపోతే సేవా కార్యక్రమాలు కూడా ఉండవన్నారు. కొన్ని వేల కుటుంబాలు ఈ సంస్థపై ఆధారపడి ఉన్నాయని దగ్గుపాటి అన్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశం గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com