- ఎమ్మెల్యే దగ్గుపాటి చొరవతో సౌదీ నుంచి అనంతపురం చేరుకున్న నిజాం.
- నిజాంకు స్వాగతం పలికిన టిడిపి నాయకులు.
- ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నిజాం కుటుంబ సభ్యులు.
- ఎమ్మెల్యే దగ్గుపాటికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన నిజాం.
- యజమాని చేతిలో చిక్కుకున్న నిజాంను సొంత ఖర్చులతో అనంతపురం రప్పించిన ఎమ్మెల్యే దగ్గుపాటి.
ఉపాధి కోసం సౌదీ దేశానికి వెళ్లి అక్కడ చిక్కుకున్న అనంతపురం కు చెందిన నిజాంను.. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్పిన మాట ప్రకారం అనంతపురానికి తీసుకొచ్చారు. నగరంలోని ఆజాద్ నగర్ కు చెందిన నిజాం పై సౌదీలో ఓనర్లు నిత్యం దాడి చేస్తూ చిత్రహింసలకు గురి చేశారు. చివరకు అతన్ని బయటికి నెట్టివేయడంతో సౌదీ లో కనీసం తినేందుకు తిండి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు ఒక వీడియో సందేశం ద్వారా తన ఆవేదనను వెల్లడించారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంటనే స్పందించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. నగరంలోని ఆజాద్ నగర్ లో ఉన్న నిజాం ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంటనే తన స్నేహితుల ద్వారా సౌదీలోని జెడ్డాలో ఉన్న నిజాంను కలిసేలా చేశారు. అనంతరం వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలుగు అసోసియేషన్ వారికి నిజాంను అప్పజెప్పారు. జెడ్డా నుంచి సౌదీ రాజధాని రియాద్ కు నిజాంను తీసుకొచ్చారు. అక్కడ నుంచి అనంతపురం తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని అంశాలు అధికారులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం నిజాం సౌదీ నుంచి అనంతపురం చేరుకున్నారు. ఆజాద్ నగర్ కు చేరుకోగానే నిజాం కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది నిజాం ఇంటికి వెళ్లి పరామర్శించారు. అక్కడ ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని మీ కుటుంబానికి ఎమ్మెల్యే దగ్గుపాటి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. నిజాం అనంతపురం తీసుకురావడమే కాకుండా ఆయన కుమారుడికి ఆయన వైద్య ఖర్చులను కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎమ్మెల్యే అందిస్తారన్నారు. అలాగే సొంత ఇల్లు కూడా మంజూరు చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిజాం మాట్లాడుతూ నా పరిస్థితిని వీడియో ద్వారా తెలియజేసినప్పుడు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంటనే స్పందించారన్నారు. ఆయన సొంత ఖర్చులతోనే ఇప్పుడు సౌదీ నుంచి వచ్చేలా చూసారన్నారు.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com