- ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టల్లో ఆర్.ఓ ప్లాంట్ కు మరమ్మతులు.
- గతంలో ఎమ్మెల్యే దృష్టికి తాగునీటి సమస్య.
- సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేయించిన ఎమ్మెల్యే.
- ఎమ్మెల్యే దగ్గుపాటికి కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినిలు.
గత సంవత్సర కాలంగా తాగునీటి సమస్యతో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందికి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిష్కారం చూపించారు. నగరంలోని గిల్డాఫ్ సర్వీస్ పక్కనున్న ఎస్సీ ప్రీమెట్రిక్ బాలికల వసతిగృహంలో ఏడాది నుంచి ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులకు రావడంతో విద్యార్థినులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. దీనిపై వారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోలేదు. నిధుల లేమితో మరమ్మతులు చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వసతి గృహాల్లో మరమ్మతు పనులు చేపట్టింది. ఈ పనులు వాటిని ప్రారంభించేందుకు గత నెలలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వసతి గృహానికి వెళ్లారు. ఈ సమయంలో విద్యార్థినిలు తాగునీటి కష్టాల గురించి ఎమ్మెల్యే దృష్టి తీసుకొచ్చారు. ఆర్ఓ ప్లాంట్ చెడిపోయిందని తాగేందుకు కొళాయి నీరు వాడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులు రూ.40 వేలతో వసతిగృహంలోని తాగునీటి ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించారు. దీంతో విద్యార్థినుల తాగునీటి కష్టాలు తీరాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో ఈ సమస్య తీరిందంటూ విద్యార్థినిలు, వసతి గృహంలోని వార్డెన్లు కృతజ్ఞతలు తెలిపారు.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com