దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
- Home
- Program 13
- దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
- ప్రభుత్వ ఆసుపత్రిలో దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం.
- దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.
- నగరంలో 5చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.
- నగరంలో ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపు.
వేసవికాలం వస్తున్న నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేలా నగరంలో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. అనంతపురం సర్వజన ఆస్పత్రులో దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు గంగారాం ఇతర నాయకులతో కలిసి ఆయన చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముందుగా ప్రభుత్వాసుపత్రి ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు పలుచోట్ల వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో మజ్జిగ కూడా పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో ఇక్కడ ముందుగా చలివేంద్రం ఏర్పాటు చేశామని వర్షాకాలం ప్రారంభం వరకు ఇది కొనసాగుతుందన్నారు. ఇంకా పలువురు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దగ్గుపాటి కోరారు.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com