ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి
- Home
- Program 10
- ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి
- ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్వజనాస్పత్రిలో ప్రభుత్వ సేవలు అందుతాయి.
- గత ప్రభుత్వంలో ఆస్పత్రుల వైపు ఎవరూ తిరిగి చూడలేదు.
- ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి.
- ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి.
- సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం.. ఎంపీ అంబికా.
ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా అనంతపురం సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలలో వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జిల్లా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితోపాటు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆస్పత్రి అభివృద్ధి నూతన కమిటీ సభ్యులు కోనంకి గంగారామ్, విశాల ఫెర్రర్, రవికాంత్ రమణ, ఇతర సభ్యులు స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు ఏమి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటి అంశాల గురించి ప్రధానంగా చర్చించారు. ఇంకా ఆసుపత్రిలో ఎలాంటి అభివృద్ధి చేయాలి అనే అంశాల గురించి చర్చించారు. అందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం, ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపి సేవలపై కూడా పలువురు ప్రస్తావించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రోజూ ఆస్పత్రికి చికిత్సల కోసం వందలాదిమంది వస్తుంటారని అయితే వారికి సరిపడా సౌకర్యాలు లేవన్నారు. వీటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన అభివృద్ధి సమావేశంలో అన్ని అంశాలు చర్చించామన్నారు. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరిచి, ప్రవేటుకు ధీటుగా వైద్య సేవలు అందించే విధంగా పనిచేస్తామన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆసుపత్రిలో 65 లక్షలతో ఒక ల్యాబ్, 35 లక్షలతో ఒక మొబైల్ క్లినిక్, ప్రభుత్వ ఆసుపత్రిలో మదర్ బెస్ట్ ఫీడింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంకా చాలా కంపెనీలను సంప్రదించామని వాటి ద్వారా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com