అనంతపురం పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగేలా చేశారు.. ఎమ్మెల్యే దగ్గుపాటి
- Home
- Program 14
- అనంతపురం పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగేలా చేశారు.. ఎమ్మెల్యే దగ్గుపాటి
- అనంతపురం పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగేలా చేశారు.. ఎమ్మెల్యే దగ్గుపాటి.
- సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
- సభ అనుకున్న దానికన్నా ఎక్కువగా గ్రాండ్ సక్సెస్ అయింది.
- సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన దగ్గుపాటి.
సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ ద్వారా అనంతపురం పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగిందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. అనంతపురం నగరానికి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సభ వేదికపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లను సత్కరించారు. వేదికపై ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాత్రమే దక్కుతుందని అన్నారు. అనంతపురం శాసనసభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… తొలి విజయోత్సవ సభను.. ఇక్కడ నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సభకు జనం తరలి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతపురం అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనంతపురం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్-2 నాటికి నగరంలో డంపింగ్ యార్డ్ సమస్యకు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సభకు తాము అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో జనం తరలివచ్చారని అన్నారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోవడం వల్ల చాలామంది బయటే ఉండిపోయారన్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ లోనే జనం ఉండి పోవాల్సి వచ్చిందన్నారు. ఈ స్థాయిలో సభ జరుగుతుందని ఊహించలేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చి అర్బన్ నియోజకవర్గంలో సభను విజయవంతం చేసినందుకు పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతున్నట్లు దగ్గుపాటి తెలిపారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే దగ్గుపాటిని ప్రత్యేకంగా అభినందించారు.
“నన్ను నమ్మిన ప్రజల విశ్వాసం నాకు దేవుడిచ్చిన వరం.
ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కారం కనుగొనడమే నా కర్తవ్యం.”
CONTACT US
-
2nd Floor, Building No./Flat No: 6-5-265-5,
Street: Srinagar Colony, Nearby Landmark: Vijetha Mart, Anantapur, AP - 515004. - Dvptdp@gmail.com