*కడపోళ్లం సార్ మాకెందుకు తెలియదు*
*ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఎమ్మెల్యే దగ్గుపాటి వద్ద ఓ మహిళ స్పందన*
*ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. మహిళల స్పందన తెలుసుకుంటూ.. ముందుకు సాగిన దగ్గుపాటి*
*సాటి ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్టాండులో కలియతిరిగిన దగ్గుపాటి*
*స్త్రీ శక్తి పథకంపై ప్రతి మహిళ మోములో సంతోషం కనిపిస్తోందన్న దగ్గుపాటి*
*మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది*
కడపోళ్లం సార్… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి మాకు ఎందుకు తెలియదు… ఇది కడప జిల్లాకు చెందిన ఒక మహిళ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వద్ద స్పందించిన తీరు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు, టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ లతో కలిసి ఆయన స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల, ఎమ్మెల్యే దగ్గుపాటి, పూల నాగరాజులు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి, చైర్మన్ నాగరాజు తో కలిసి మరికొన్ని బస్సుల్లో ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళను పలుకలుస్తూ స్త్రీ శక్తి పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక మహిళ తాను ఇటీవల డీఎస్సీ రాసానని… ఎన్నో ఏళ్లుగా దీనికోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని.. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నానని చెప్పారు. అలాగే కడప జిల్లాకు చెందిన ఒక మహిళను మీరు ఎక్కడికి వెళ్తున్నారని.. పలకరించగా కడప అని సమాధానం చెప్పారు. మీకు స్త్రీ శక్తి పథకం గురించి తెలుసా అని ఎమ్మెల్యే దగ్గుపాటి ఆరా తీయగా… కడపోళ్లం సార్ మాకెందుకు తెలియదు అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. పులివెందులలో మీ వాళ్ళు ఓటు వేశారా అని దగ్గుపాటి మరో ప్రశ్న అడిగారు. 40 ఏళ్ల తర్వాత మా వాళ్లంతా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు సార్ అంటూ ఆమె సమాధానం చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తున్నారంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి బస్టాండ్ ఆవరణంలో కలియతిరిగారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అక్కడే ఒక టీ స్టాల్ లో ప్రయాణికులతో టీ తాగుతూ… స్త్రీ శక్తి పథకం గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు ఆయన ఇలా ప్రయాణికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే


