వైసీపీ రిలే దీక్షలను ప్రజలు పట్టించుకోవడం లేదు… ఎమ్మెల్యే దగ్గుపాటి*
*రుద్రంపేటలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం*
*చంద్రబాబు నగర్ లో 35 ఏళ్లుగా ఉన్న రోడ్డు సమస్యకు పరిష్కారం*
*కోటి 44 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన దగ్గుపాటి*
*మెగా డీఎస్సీ, లిక్కర్ స్కామ్ తో పాటు ఏదైనా చర్చించడానికి సిద్ధమన్న దగ్గుపాటి*
వైసిపి చేస్తున్న రిలే నిరాహార దీక్షలను ఎవరు పట్టించుకోవడంలేదని.. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం రుద్రంపేట పంచాయతీ చంద్రబాబునగర్ లో ఆయన ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టిడిపి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గుపాటికి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబునగర్ లో ఆయన కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. చంద్రబాబు నగర్ లో 35 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డుకు పరిష్కారం చూపించారు. నూతనంగా కోటి 44లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. దీనిపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్తుంటే విశేష స్పందన వస్తోందన్నారు. మా కార్యకర్తలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు మంచి స్వాగతం పలుకుతున్నారని…ఇదే మా పని తీరుకి అడ్డం పడుతోందని దగ్గుపాటి అన్నారు. ఒక రుద్రంపేట పంచాయతీలోనే ఈ రెండేళ్లలో 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో కనీసం ఇక్కడ ఒక చిన్న అభివృద్ధి కూడా జరగలేదన్నారు. కేవలం చిన్న చిన్న కారణాలవల్ల ఇన్నేళ్లుగా రోడ్డును అలాగే పెండింగ్ లో ఉంచారన్నారు. తామ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దానికి పరిష్కారం చూపించామన్నారు. దీనివలన ఎంతోమంది ప్రజలకు ఉపయోగ చేకూరిందని తెలిపారు. మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా వైసిపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. అసలు వీరిని ఎవరు పట్టించుకునే లేదని కేవలం అందులో గొడ్డలి పార్టీ కార్యకర్తలు మాత్రమే పాల్గొంటున్నారని విమర్శలు చేశారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి 16,347 ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేశారని గుర్తు చేశారు. గతంలో ఉపాధ్యాయులను బాత్రూంల వద్ద వైన్ షాపుల వద్ద ఉంచి అవమానించిన జగన్ కు, ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తున్న నారా లోకేష్ గారికి చాలా తేడా ఉందన్నారు.


